హీరోయిన్ దీపిక పదుకొనే రూపంలో మార్కెట్‌లో బొమ్మలు
- పద్మావత్ సినిమాలో యువరాణిగా నటించిన దీపిక
- అదే రూపంలో డాల్స్
- సంబరపడిపోతున్న అభిమానులు
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించిన పద్మావత్ సినిమాలోని ఆమె రూపంలో మార్కెట్‌లోకి బొమ్మలు వచ్చాయి. ఈ డాల్స్ ను చూసి ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ డాల్స్ బార్బీ బొమ్మలను తలపిస్తున్నాయంటున్నారు. ఇటీవలే దీపిక ఛపాక్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చింది.
అంతకు ముందు ఆమె నటించిన 'పద్మావత్' సినిమాలో ఆమె యువరాణి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఒంటి నిండా ఆభరణాలతో ఆమె అందులో కనపడిన తీరు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అచ్చం అదే రూపంలో దీపిక బొమ్మలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గతంలోనూ పలువురు బాలీవుడ్ నటుల బొమ్మలు మార్కెట్లోకి వచ్చాయి.