వైసీపీ వల్ల బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారు: కాల్వ శ్రీనివాసులు

  • టీడీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కసుతో వారిని అణగదొక్కుతున్నారు
  • సుప్రీంకోర్టులో పసలేని వాదనలను వినిపించడం వల్ల బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారు
  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి వైసీపీ తూట్లు పొడుస్తోంది
బీసీలు టీడీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కసుతో వారిని వైసీపీ ప్రభుత్వం అణగదొక్కేందుకు కుట్ర చేస్తోందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ 34 నుంచి 24 శాతానికి పడిపోయిందని చెప్పారు. సుప్రీంకోర్టులో పసలేని వాదనలను వినిపించడం వల్లే బీసీలు రిజర్వేషన్లను కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.



More Telugu News