కేసీఆర్ మేనిఫెస్టోను భగవద్గీతలా భావిస్తారు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
- అందుకే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపిస్తున్నారు
- కేసీఆర్ మార్గదర్శకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నాం
- గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులిచ్చామని వెల్లడి
తమది మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నామని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. బడ్జెట్ కు సంబంధించి శాసన మండలి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘టీఆర్ఎస్ మేనిఫెస్టోలను భగవద్గీతలా, బైబిల్ లా, ఖురాన్ లా భావించే సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాం. చెప్పిన మాటను తూచా తప్పకుండా చేస్తున్న ప్రభుత్వం మాది. అందుకే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారు. తనను నమ్మిన ప్రజలు ఏ మాత్రం అసంతృప్తికి గురిచేయకుండా బడ్జెట్ ను ప్రవేశ పెట్టాం..” అని కర్నె ప్రభాకర్ చెప్పారు.
పల్లెలే పట్టుకొమ్మలన్న మాటకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గ్రామీణాభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ. 23 వేల కోట్లు కేటాయించారన్నారు. అదే సమయంలో పట్టణాల అభివృద్ధి కోసం కూడా భారీగా నిధులిచ్చారని.. హైదరాబాద్ కోసమైతే ఎన్నడూ లేనంతగా రూ.10 వేల కోట్లు బడ్జెట్ ఇచ్చారని చెప్పారు.
‘‘టీఆర్ఎస్ మేనిఫెస్టోలను భగవద్గీతలా, బైబిల్ లా, ఖురాన్ లా భావించే సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాం. చెప్పిన మాటను తూచా తప్పకుండా చేస్తున్న ప్రభుత్వం మాది. అందుకే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారు. తనను నమ్మిన ప్రజలు ఏ మాత్రం అసంతృప్తికి గురిచేయకుండా బడ్జెట్ ను ప్రవేశ పెట్టాం..” అని కర్నె ప్రభాకర్ చెప్పారు.
కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే ముందున్నాం
అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలబడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కర్నె ప్రభాకర్ చెప్పారు. ఇవాళ బడ్జెట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోందని, కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే ముందుంటున్నామని తెలిపారు. దేశంలో విపత్కర, గందరగోళ పరిస్థితులు ఉన్నా తెలంగాణ ఆరోగ్య రంగంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు.పల్లెలే పట్టుకొమ్మలన్న మాటకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గ్రామీణాభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ. 23 వేల కోట్లు కేటాయించారన్నారు. అదే సమయంలో పట్టణాల అభివృద్ధి కోసం కూడా భారీగా నిధులిచ్చారని.. హైదరాబాద్ కోసమైతే ఎన్నడూ లేనంతగా రూ.10 వేల కోట్లు బడ్జెట్ ఇచ్చారని చెప్పారు.