'జెర్సీ' దర్శకుడితో చరణ్?

  • 'జెర్సీ'తో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి 
  • హిందీ రీమేక్ పనులతో బిజీ 
  • లైన్లో చరణ్ ప్రాజెక్ట్ 
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన యువ దర్శకులలో 'గౌతమ్ తిన్ననూరి' ఒకరు. 'జెర్సీ' సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని గౌతమ్ అందించాడు. హిందీలో రూపొందుతున్న 'జెర్సీ' రీమేక్ కి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. అలాంటి గౌతమ్ తన తదుపరి సినిమాను చరణ్ తో చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల చరణ్ ను కలిసిన గౌతమ్ ఆయనకి ఒక కథను వినిపించాడట. ఆ కథలోని కొత్తదనం .. తన పాత్రలోని వైవిధ్యం కారణంగా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ .. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తరువాత, గౌతమ్ తో కలిసే సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.


More Telugu News