టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య... ప్రకటించిన చంద్రబాబు

  • టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేస్తామన్న చంద్రబాబు
  • పార్టీ ఏజెంట్ కు చూపించి ఓటేయాలని స్పష్టీకరణ
  • ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని వెల్లడి
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున అభ్యర్థిని ప్రకటించారు. తమ పార్టీ తరఫున వర్ల రామయ్యను బరిలో నిలుపుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఈ మేరకు వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్ కు చూపించి ఓటేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. అటు, వైసీపీ ఇప్పటికే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఏపీ నుంచి వైసీపీ పక్షాన రాజ్యసభ బరిలో ఉన్నారు.


More Telugu News