త్రివిక్రమ్ దర్శకత్వంలో కుదిరితే చిరూ .. లేదంటే చరణ్!

  • త్రివిక్రమ్ వెంటపడుతున్న స్టార్ హీరోలు 
  • ఎన్టీఆర్ తో తదుపరి సినిమా
  • మే నుంచి సెట్స్ పైకి  
'అల వైకుంఠపురములో' సినిమాతో తిరుగులేని హిట్ ను త్రివిక్రమ్ సొంతం చేసుకున్నాడు. దాంతో ఆయనతో సినిమా చేయడానికి మిగతా స్టార్ హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మే నెల నుంచి ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమా చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన చిరంజీవితో చేయనున్నాడని  ఒకసారి, చరణ్ తో చేయనున్నాడని ఒకసారి వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే త్రివిక్రమ్ మాత్రం అటు చిరంజీవి  కోసం .. ఇటు చరణ్ కోసం రెండు కథలను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. కుదిరితే చిరంజీవితో .. లేదంటే చరణ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా ఆయన రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇప్పటివరకూ మెగా హీరోల్లో పవన్ .. అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన త్రివిక్రమ్, ఈ సారి చిరూతోగానీ .. చరణ్ తో గాని చేయడం ఖాయమని అంటున్నారు.


More Telugu News