మీరలా చేస్తే.. నేను రాజ్యసభ పోటీ నుంచి తప్పుకుంటాను: జగన్‌కి వర్ల రామయ్య సవాలు
- నత్వానీని తీసేసి ఓ దళితుడిని పోటీకి దింపాలి
- వైసీపీలో ఉన్న నాయకత్వానికి సవాలు చేస్తున్నాను
- నేను పోటీ నుంచి తప్పుకుంటాను
- నేను నా పార్టీని ఒప్పిస్తాను
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టికెట్ ఇచ్చిన విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.
'నత్వానీని తీసేసి ఓ దళితుడిని పోటీకి దింపాలి. వైసీపీలో ఉన్న నాయకత్వానికి సవాలు చేస్తున్నాను. నేను పోటీ నుంచి తప్పుకుంటాను. నేను నా పార్టీని ఒప్పిస్తాను. 13వ తారీఖు దాకా సమయం ఉంది. దళితులను పోటీకి పెడితే నేను విత్ డ్రా అవుతాను. దళిత నేతలు ఈ విషయంపై జగన్‌ను ఒప్పించండి. లేదంటే వైసీపీ నాయకులు నాకు ఓటేయండి. అంబేద్కర్ వాణి పార్లమెంటులో వినపడాలంటే నేనొక్కడినే ఉన్నాను' అని వ్యాఖ్యానించారు.