ఉగాది రోజునే మహేశ్ బాబు మూవీకి ముహూర్తం?
- వంశీ పైడిపల్లితో ప్రాజెక్టు వాయిదా
- రంగంలోకి దిగిన పరశురామ్
- ఉగాదికి లాంచ్ చేసే అవకాశం
మహేశ్ బాబు తన తదుపరి సినిమాను వంశీ పైడిపల్లితో చేయాలనుకున్నాడు. అయితే ఆ కథ సెకండాఫ్ నచ్చకపోవడంతో, మహేశ్ బాబు ఆ ప్రాజెక్టును వాయిదా వేశాడు. వంశీ పైడిపల్లి సినిమా తరువాత పరశురామ్ తో చేయాలనుకున్న ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కథపైనే పరశురామ్ కసరత్తు చేస్తున్నాడు. మరో వైపున ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.
ఉగాది రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించి, లాంఛనంగా షూటింగును మొదలెట్టే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రోజునే ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు తెలిసే అవకాశం వుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి భారీ విజయం తరువాత పరశురామ్ చేస్తోన్న సినిమా కావడంతో, అందరిలో ఆసక్తి పెరుగుతోంది.