బెల్లంకొండ శ్రీనివాస్ కి 'అల్లుడు' సెంటిమెంట్!
- సంతోష్ శ్రీనివాస్ నుంచి మరో మాస్ మూవీ
- బెల్లంకొండ సరసన ఇద్దరు నాయికలు
- ఏప్రిల్ 30వ తేదీన భారీ విడుదల
'రాక్షసుడు' సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'అల్లుడు అదుర్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'అల్లుడు' టైటిల్ తో వచ్చిన చాలా సినిమాలు .. చాలా వరకూ విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ తోనే దర్శక నిర్మాతలు ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేశారని అంటున్నారు.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాగా 'అల్లుడు శీను' వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంట్ కారణంగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ సినిమా టైటిల్ కి ఓకే చెప్పాడట. నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాను, వచ్చేనెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ హీరోగా బెల్లంకొండ మరోమారు చెలరేగిపోనున్నాడన్నమాట.