'అదిరే అభి' వల్లనే ఈ స్థాయిలో వున్నాను: 'జబర్దస్త్' నవీన్

  • అదిరే అభి మంచి మనసున్నవాడు 
  •  ఈర్ష్య అసూయలు ఆయనకి తెలియవు
  • 'జబర్దస్త్' వల్లనే ఈ అవకాశాలన్న నవీన్
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో నవీన్ ఒకరు. గుబురు గెడ్డంతో ప్రత్యేకమైన లుక్ తో కనిపిస్తూ కితకితలు పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి నవీన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, " నా కెరియర్ ను తీసుకుంటే, అభితో పరిచయానికి ముందు .. పరిచయానికి తరువాత అని చెప్పొచ్చు. తన దగ్గర నుంచి వచ్చిన వాళ్లు బాగుండాలి .. జీవితంలో సెటిల్ కావాలి అని అభి భావిస్తాడు.

తను అవకాశం ఇచ్చిన వాళ్లు కెరియర్ పరంగా ఎదుగుతుంటే సంతోషపడతాడేగానీ, ఈర్ష్య .. అసూయలు అనేవి ఆయనకి తెలియవు. తన కారణంగా ఎదిగిన హైపర్ ఆదిని .. నన్ను అభి ఇప్పటికీ ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. అదిరే అభి కారణంగానే జబర్దస్త్ కి వెళ్లాను .. ఆ క్రేజ్  కారణంగానే ఈవెంట్స్ చేస్తున్నాను. సినిమాలు కూడా చేస్తూ వెళుతున్నాను. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి అదిరే అభినే కారణం" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News