లవర్ మోసం చేశాడని... అమలాపురం ఎన్నికల్లో అతనిపైనే పోటీకి దిగిన రేణుక!

  • తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఘటన
  • ఇంటింటికీ తిరిగి నాకు జరిగిన అన్యాయం గురించి చెబుతా
  • నామినేషన్ అనంతరం రేణుక
తనను ప్రేమించిన ఓ వైసీపీ నాయకుడి పుత్రరత్నం, పెళ్లి విషయాన్ని ఎత్తేసరికి మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, అతనిపైనే స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిందో యువతి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం 15వ వార్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే, మునిసిపాలిటీలో కీలక నేతగా ఉన్న ఓ వ్యక్తి కుమారుడు తనను ప్రేమించాడని, ‌పెళ్లికి మాత్రం నిరాకరించాడని సూర్యనగర్ ప్రాంతానికి చెందిన బైరుశెట్టి రేణుక ఆరోపించింది.

ఈ విషయాన్ని పెద్దలు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా తనకు న్యాయం జరగలేదని అంటున్న రేణుక, తన తల్లితో కలిసి వచ్చి, సదరు నేత కుమారుడు బరిలోకి దిగిన వార్డులో స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసింది. ఇంటింటికీ తిరిగి, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేస్తానని ఆమె అంటోంది. రేణుక ఎంబీఏ చ‌దివిన విద్యావంతురాలు కావడంతో పోటీలో ఉన్న ప్రియుడు కూడా ఆందోళన చెందుతున్నారట. రేణుక మాత్రం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ తిరిగి తన ప్రియుడికి బుద్ధి చెప్పి తీరుతానని హెచ్చరిస్తోంది.


More Telugu News