టీడీపీకి అభ్యర్థులు దొరకక 5 నుంచి 10 లక్షలు ముట్టచెప్పి..!: విజయసాయిరెడ్డి

  • లక్షల రూపాయలు ముట్టచెప్పి నామినేషన్లు వేయించారు
  • వాళ్లెక్కడ ఉపసంహరించుకుంటారో అని క్యాంపులకు తరలిస్తున్నారట
  • గెలిచిన వాళ్లను రహస్య స్థావరాలకు తీసుకెళ్లడం గురించి విన్నాం
  • నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ? 
టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. స్థానిక సంస్థల నేపథ్యంలో టీడీపీ నుంచి నామినేషన్లు వేసే వారు కరవైపోయారని అన్నారు. 'టీడీపీకి అభ్యర్థులు దొరకక 5 నుంచి 10  లక్షల రూపాయలు ముట్టచెప్పి నామినేషన్లు వేయించారు. గెలిచే సీన్ లేక వాళ్లెక్కడ ఉపసంహరించుకుంటారో అని క్యాంపులకు తరలిస్తున్నారట. గెలిచిన వాళ్లను రహస్య స్థావరాలకు తీసుకెళ్లడం గురించి విన్నాం. నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ?' అని ఆరోపించారు.
 
'ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ గారు 5 నెలల క్రితమే ప్రకటించారు. పట్టా డాక్యుమెంట్లు సిద్ధం చేయడం కూడా పూర్తయింది. పండుగ రోజున పేదలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని బాబు పంపిణీ నిలిపేయాని కోర్టుకు వెళ్లాడు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నాడు' అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. 


More Telugu News