స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలి : ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • అవే ఎన్నికలను కొనసాగింపునకు అంగీకరించం 
  • అధికార పార్టీకి అధికారులు వత్తాసు పలుకుతున్నారు 
  • అధికారులపై ప్రైవేటు కేసులు పెడతాం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఎన్నికలను వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ యథావిధిగా ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది సరైనది కాదని అశోక్ బాబు అన్నారు. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలు తెలియనివి కాదని, అధికార పార్టీ తరపున అధికారులే బెదిరింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తొలినుంచి నిర్వహించాలని కోరారు. అలాగే, అధికార పార్టీకి వత్తాసుపలుకుతున్న అధికారులను విడిచి పెట్టమని, వారి పై ప్రైవేటు కేసులు దాఖలు చేస్తామని హెచ్చరించారు.



More Telugu News