మరోసారి రవితేజ జోడీ కడుతున్న తమన్నా
- 'క్రాక్' సినిమాతో బిజీగా రవితేజ
- లైన్లో దర్శకుడు రమేశ్ వర్మ
- త్రినాథరావు సినిమా కోసం తమన్నా
ప్రస్తుతం రవితేజ .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత 'రాక్షసుడు' దర్శకుడు రమేశ్ వర్మతో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుతో నక్కిన త్రినాథరావు రెడీగా వున్నాడు.
ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడట. దాదాపుగా కథానాయికగా ఆమెనే ఖరారు కావొచ్చని అంటున్నారు. 'బెంగాల్ టైగర్' తరువాత రవితేజతో తమన్నా జోడీ కడుతున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్ గా ఉంటుందనీ, తమన్నా పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి.