టీ–సర్కార్​ ఆదేశాలను పట్టించుకోని విద్యాసంస్థలు.. నోటీసుల జారీ

  • ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు
  • ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని విద్యా సంస్థలు
  • ఆయా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం 
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటిని మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల అమలు నిమిత్తం విద్యా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ బృందాలను నియమించింది.

అయితే, హైదరాబాద్ లోని  కొన్ని విద్యా సంస్థలు ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ఆయా విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యా శాఖకు చెందిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఆయా పాఠశాలల వివరాలను వెల్లడించారు.


More Telugu News