చంద్రబాబయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు: విజయసాయిరెడ్డి
- నిమ్మగడ్డ రాసినట్లున్న లేఖ ఎవరు సృష్టించినా కేసులు ఎదుర్కోవాల్సిందే
- అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలున్నాయి
- ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాసినట్లు జరుగుతోన్న ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబయినా, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అయినా సరే ఎవరూ ఇందులోంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
'నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు' అని విజయసాయిరెడ్డి అన్నారు.