నేను ఎయిర్ పోర్టు బాత్రూంలో దాక్కున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవం: గాయని కనిక
- కరోనా బారినపడిన గాయని కనిక
- స్క్రీనింగ్ నుంచి తప్పించుకుందంటూ ఆరోపణలు
- ఎయిర్ పోర్టు బాత్రూంలో దాక్కుందంటూ కథనాలు
ప్రముఖ బాలీవుడ్ గాయని కనిక కపూర్ కరోనా బాధితుల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు కరోనా వైరస్ సోకిందన్న విషయం కంటే ఆమె హాజరైన పార్టీలకు వందల సంఖ్యలో అతిథులు వచ్చారన్న విషయం తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పుడు వారందరి వివరాలు సేకరించే పనిలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి.
ఇక అసలు విషయానికొస్తే, ముంబయి ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ నుంచి తప్పించుకోవడానికి కనిక కపూర్ బాత్రూంలో దాక్కున్నట్టు కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు. తాను బాత్రూంలో దాక్కున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ వద్ద స్క్రీనింగ్ ను తప్పించుకోవడం సాధ్యమయ్యే పనేనా చెప్పండి? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
అంతేకాదు, తాను పార్టీ ఇచ్చానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, చిన్న బర్త్ డే పార్టీలో మాత్రం పాల్గొన్నానని వివరణ ఇచ్చారు. "అదేమంత పెద్ద పార్టీ కాదు. 400 మంది పాల్గొనలేదు. నాతో పాటు హాజరైన వారి వివరాలు ఇప్పటికే అధికారులకు ఇచ్చాను. అయినా స్క్రీనింగ్ సమయానికి నాలో ఎలాంటి లక్షణాలు లేవు. గత నాలుగు రోజుల నుంచే నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి" అంటూ కనిక వెల్లడించారు.