వేల్పూరు మాజీ సర్పంచ్ మృతి వైసీపీ దుష్టశక్తుల పనే: వర్ల రామయ్య

  • హైమారావు మృతదేహానికి వర్ల నివాళులు
  • చంద్రబాబు ప్రతినిధిగానే వచ్చానన్న నేత
  • ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ
గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు మాజీ సర్పంచ్, శావల్యాపురం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి పారా హైమారావు మృతికి వైసీపీ దుష్టశక్తులే కారణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. నిన్న హైమారావు మృతదేహానికి నివాళులు అర్పించిన వర్ల అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. హైమారావు మృతి విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లిందని, ఆయన ప్రతినిధిగానే ఇక్కడికి వచ్చినట్టు వర్ల తెలిపారు. హైమారావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వర్ల హామీ ఇచ్చారు.


More Telugu News