అలిపిరి వద్ద పోలీసు అధికారులే పెళ్లి పెద్దలైన వేళ..!
- తిరుమల కొండపై పెళ్లి చేసుకోవాలనుకున్న కొత్త జంట
- కొండపైకి అనుమతించని పోలీసులు
- అలిపిరి వద్ద గరుడ విగ్రహం ఎదుట పెళ్లి చేసుకోవాలని సూచన
కరోనా కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఓ కొత్త జంట తిరుపతి అలిపిరి వద్దే పెళ్లి చేసుకుని వెనుదిరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఓ జంట తిరుమల కొండపై పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. అందుకు తగ్గట్టుగానే బంధువర్గంతో కలిసి శనివారం తిరుపతి చేరుకున్నారు. అయితే కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అలిపిరి వద్ద వారిని పోలీసులు నిరోధించారు. తిరుమలకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడంలేదని చెప్పడంతో వారు నిరాశకు గురయ్యారు.
అయితే పోలీసులు వారికి నచ్చచెప్పి అలిపిరి వద్ద ఉన్న గరుడ విగ్రహం సాక్షిగా పెళ్లి చేసుకోమని ప్రోత్సహించారు. దాంతో ఇరు కుటుంబాల వారు అంగీకరించి, అక్కడే పోలీసుల సమక్షంలో కొత్త జంటకు వివాహం జరిపించారు. తిరుపతి అర్బన్ డీఎస్పీలు మురళీకృష్ణ, నాగసుబ్బన్న, ఇతర పోలీసులు పెళ్లిపెద్దలుగా మారి నూతన వధూవరులను దీవించారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది సైతం అక్షింతలు చల్లి ఆశీస్సులు అందించారు.