చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... సుక్మా జిల్లాలో నిన్న గల్లంతైన జవాన్లు మృతి
- నిన్న చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
- సుక్మా జిల్లాలో జవాన్లకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు
- అటవీప్రాంతంలో పడివున్న 17 మంది జవాన్ల మృతదేహాలు
చత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో పెద్ద సంఖ్యలో జవాన్లు గల్లంతు కాగా, ఇప్పుడు వారందరూ మృతి చెందినట్టు గుర్తించారు. సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది జవాన్లు మరణించారు. నేడు వారి మృతదేహాలు ఉన్న అటవీ ప్రాంతానికి భద్రతాబలగాలు చేరుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో మరో 15 మంది జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల అనంతరం భద్రతాసిబ్బంది ఆయుధాలను మావోలు ఎత్తుకెళ్లారు. నక్సల్స్ ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో శక్తిమంతమైన గ్రెనేడ్ లాంచర్ తో పాటు పలు ఆటోమేటిక్ రైఫిళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.