రోడ్లపై జనాన్ని చూసి ఆగ్రహించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్.. ఒక్కొక్కరి దగ్గరికీ వెళ్లి వార్నింగ్!
- తెలంగాణలో లాక్ డౌన్ విధింపు
- ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచన
- బేఖాతరు చేస్తూ సిరిసిల్లలో రోడ్లపై తిరుగుతున్న ప్రజానీకం
- కలెక్టర్ రౌద్రావతారం
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలను సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితిని చూసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహానికి గురయ్యారు.
అవసరం లేకున్నా కొందరు రోడ్లపై తిరుగుతూ కనిపించడాన్ని గుర్తించిన కలెక్టర్ వారిపై మండిపడ్డారు. స్వయంగా సిరిసిల్ల పట్టణంలో కలియదిరుగుతూ పర్యవేక్షణ చేసిన కలెక్టర్ అనేకమంది వాహనదారులకు క్లాస్ తీసుకున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేకపోతే కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాహనాలను ఆపి మరీ హెచ్చరించారు.
ఓ బైక్ పై ముగ్గురు రావడాన్ని గుర్తించిన కలెక్టర్ వారిని ఆపి తీవ్రస్వరంతో మందలించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కలెక్టర్ రౌద్రావతారాన్ని దూరం నుంచే గమనించిన మరికొందరు వాహనదారులు అట్నుంచి అటే వెనక్కి మళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.