ఏపీలో మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ల ఏర్పాటు: విజయసాయిరెడ్డి
- అసెంబ్లీ, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి వరకు మూడంచెల్లో రక్షణ
- విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు పరీక్షిస్తున్నారు
- ఐసోలేషన్ లో ఉంచుతూ స్వల్ప లక్షణాలు కన్పించినా టెస్టులు చేస్తున్నారు
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. అన్ని ముందస్తు జాగ్రత్తలను సూచిస్తోందని చెబుతూ ట్వీట్ చేశారు.
'అసెంబ్లీ, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు పరీక్షించి ఐసోలేషన్ లో ఉంచడం, స్వల్ప లక్షణాలు కన్పించినా టెస్టులు చేయడం ప్రభుత్వ ముందు జాగ్రత్తలను సూచిస్తోంది' అని తెలిపారు.