శీనన్నా... జరంత చేతులు కడుక్కోరాదే: దానం నాగేందర్

  • లాక్ డౌన్ వేళ తలసాని క్షేత్రస్థాయి పరిశీలన
  • దానం నాగేందర్ ఇంటికి వెళ్లిన తలసాని
  • శానిటైజర్ ను స్వయంగా ఇచ్చిన దానం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, నిత్యావసర సరకుల పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా దానం ఇంటికి తలసాని వచ్చిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

తన ఇంటి వద్ద శానిటైజర్ లను ఏర్పాటు చేసిన దానం నాగేందర్, వాటిని తానే స్వయంగా అందరికీ అందించి, చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అరచేతిపై శానిటైజర్ ను వేశారు. ఆయనతో చేతులు కడిగించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రజలు ఒకేసారి దుకాణాల వద్దకు వెళ్లకుండా ఉండాలని అన్నారు. బేగంబజార్ హోల్ సేల్ మార్కెట్ లో 300 దుకాణాలు ఉన్నాయని, పక్కపక్కనే ఉన్న దుకాణాలు తెరవకుండా, రోజుకు 40 దుకాణాలు తెరచుకుని వ్యాపారాలు చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు.


More Telugu News