ఇప్పుడే రాజమౌళితో మాట్లాడాను... సాయంత్రం 4 గంటలకు వచ్చేస్తుంది బ్రదర్: రామ్ చరణ్ తో ఎన్టీఆర్

  • నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు
  • విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్
  • ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ
నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కాగా, ఈ సందర్భంగా 'రౌద్రం రణం రుధిరం' నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని రాజమౌళి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ లుక్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుండగా, ఈ విషయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

తొలుత రామ్ చరణ్ కు క్షమాపణలు చెబుతూ, నీకివ్వాల్సిన బహుమతిని జక్కన్నకు పంపించానని, కాస్తంత ఆలస్యంగానైనా అందుతుందని చెప్పారు. దీనిపై స్పందించిన రామ్ చరణ్, ఈరోజు తనకు ఆ బహుమతి అందుతుందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ, "యస్ బ్రో... ఇప్పుడే జక్కన్నతో మాట్లాడాను. సాయంత్రం 4 గంటలకు తప్పకుండా అందుతుంది" అని అన్నారు. ఇక వీరి మధ్య సంభాషణ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, ఇటు మెగాభిమానులకూ ఆనందాన్ని కలిగిస్తోంది.


More Telugu News