రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
- వ్యవసాయ శాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలి
- రేపటి నుంచి శనగల కొనుగోలు ప్రారంభించాలి
- సమీక్షా సమావేశం నిర్వహించిన హరీశ్ రావు
లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, యూరియా షాపులను ప్రతిరోజు ఉదయం తెరవాలని, ఈ మేరకు వ్యవసాయ శాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రేపటి నుంచి శనగల కొనుగోలు ప్రారంభించాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు వహించాలని, మార్కెట్ల వద్ద పర్యవేక్షణకు అధికారులను ఏర్పాటు చేయాలని, షాపింగ్ మాల్స్, కిరాణా, ఇతర దుకాణాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. నిత్యావసరాల కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు.