పవన్ ను అభినందించిన తెలంగాణ గవర్నర్... మీ సందేశం మరింత ప్రోత్సాహకరమన్న జనసేనాని
- తమిళనాడులో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు
- పవన్ చొరవతో ఆదుకున్న తమిళనాడు ప్రభుత్వం
- పవన్ ప్రయత్నాన్ని కొనియాడిన తమిళిసై
లాక్ డౌన్ కారణంగా తమిళనాడులో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారుల కోసం చొరవ ప్రదర్శించారని, విపత్కర పరిస్థితుల్లో ఉన్న అభాగ్యుల పట్ల గొంతుక వినిపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనస్ఫూర్తిగా అభినందించారు. మీ ప్రయత్నాలకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు పవన్ ను ఉద్దేశించి తమిళిసై ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు పవన్ వినమ్రంగా బదులిచ్చారు. గవర్నర్ తమిళిసై గారూ, మీ హార్దిక సందేశానికి ముగ్ధుడ్నయ్యాను అంటూ స్పందించారు. "భవిష్యత్తులో ఎంతోమంది నిర్భాగ్యుల తరఫున నిలిచేందుకు మీ సందేశం ఎనలేని ప్రోత్సాహాన్నిస్తోంది. మీ ద్వారా తమిళనాడు సీఎం కార్యాలయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.