'గీతాంజలి' నన్ను మళ్లీ నిర్మాతగా మార్చేసింది: కోన వెంకట్

  • 'ఢీ' మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది 
  • సంతృప్తినిచ్చిన చిత్రం 'నిన్నుకోరి'
  • నిర్మాతగా కొనసాగుతూనే ఉన్నానన్న కోన 
రచయితగా కోన వెంకట్ అనేక చిత్రాలకు పనిచేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన మళ్లీ నిర్మాతగా మారారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన ఆ విషయాలను పంచుకున్నారు. "రైటర్ గా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రం 'ఢీ'. ఆ సినిమా నన్ను స్టార్ రైటర్ గా మార్చేసింది. 'రెడీ' .. 'కింగ్' .. 'దూకుడు' .. 'బాద్షా' .. 'అదుర్స్' వంటి సినిమాలు నా సక్సెస్ గ్రాఫ్ ను పెంచుతూ వెళ్లాయి.

రైటర్ గా నాకు నూటికి నూరు శాతం సంతృప్తిని ఇచ్చిన సినిమాలు 'గీతాంజలి' .. 'నిన్నుకోరి' అని చెప్పొచ్చు. 'తోకలేని పిట్ట' ద్వారా నిర్మాతగా కెరియర్ ను మొదలుపెట్టిన నేను, 'గీతాంజలి' సినిమాతో మళ్లీ నిర్మాతగా మారాను. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాను. అప్పటి నుంచి నిర్మాతగానూ కొనసాగుతూనే వున్నాను" అని చెప్పుకొచ్చారు.


More Telugu News