1000 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్

  • 1,028 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 317 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 8 శాతం వరకు పెరిగిన ఐటీసీ
ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవడంతో పాటు... 21 రోజుల ఇండియా లాక్ డౌన్ ఏడో రోజుకు చేరుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాలతో కొనసాగాయి. 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,028 పాయింట్ల లాభంతో 29,468కి పెరిగింది. నిఫ్టీ 317 పాయింట్లు పుంజుకుని 8,597కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (7.84%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (7.76%), ఓఎన్జీసీ (7.64%), టాటా స్టీల్ (6.14%), టెక్ మహీంద్రా (5.96%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-14.68%), మారుతి సుజుకి (-1.23%), బజాజ్ ఫైనాన్స్ (-1.17%), టైటాన్ కంపెనీ (-0.97%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.85%).


More Telugu News