ఉదయం 9 గంటలకే 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి: ఏపీ అధికారులు

  • ప్రత్యేక జాగ్రత్తలతో పనిపూర్తి చేస్తున్న వలంటీర్లు 
  • వేలిముద్రలు కాకుండా ఫొటో గుర్తింపు కార్డుతో అందజేత 
  • రాష్ట్రంలో 59 లక్షల మంది లబ్ధిదారులు

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగుతోందని ఏపీ అధికారులు తెలిపారు. కరోనా భయం నేపథ్యంలో వలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేలి ముద్రలు కాకుండా గుర్తింపు కార్డు ఆధారంగా పింఛన్ అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 59 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఉదయం 9 గంటల సమయానికి 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని తెలిపారు.



More Telugu News