'అయినను పోయిరావలె హస్తినకు' అప్ డేట్
- గతంలో సక్సెస్ ను సాధించిన 'అరవింద సమేత'
- మరో సారి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్
- ఒక కథానాయికగా బాలీవుడ్ భామ
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.
'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు వుంది. ఒక కథానాయికను బాలీవుడ్ నుంచి పరిచయం చేసే ఆలోచన చేస్తున్నారు. మరో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు. గతంలో త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ .. పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.