క్లార్క్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్, కోహ్లీ

  • ఏడుగురితో లిస్ట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
  • తన కెరీర్లో ఆడిన వారికే అవకాశం
  • సాంకేతికంగా సచిన్ బెస్ట్ అని కితాబు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రకటించిన ఏడుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. తన కెరీర్లో కలిసి ఆడిన, ప్రత్యర్థి జట్ల నుంచి క్లార్క్.. ఏడుగురు గొప్ప ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఇందులో తమ దేశం నుంచి రికీ పాంటింగ్‌కు మాత్రమే చాన్స్ ఇచ్చిన క్లార్క్ భారత్ నుంచే ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్, కుమార సంగక్కర ఈ జాబితాలో ఉన్న ఇతర ఆటగాళ్లు.

తాను చూసిన ఆటగాళ్లలో సాంకేతికంగా అత్యుత్తమ బ్యాట్స్‌మన్ సచిన్ అని క్లార్క్ కితాబిచ్చాడు. మాస్టర్ బ్లాస్టర్ ను  ఔట్ చేయడం చాలా కష్టమైన పని అని, సాంకేతికంగా అతనిలో ఎలాంటి బలహీనత లేదని అన్నాడు. ఇక ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ఉత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీనే అని క్లార్క్ చెప్పాడు. కోహ్లీ వన్డే, టీ20 రికార్డులు అద్భుతమని, టెస్టు క్రికెట్‌లో కూడా అతను ఆధిపత్యం చూపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. సచిన్, కోహ్లీ ఇద్దరూ శతకాలు చేయడాన్ని ఇష్టపడతారని చెప్పాడు.


More Telugu News