31వ సినిమా కోసం కథలు వింటున్న ఎన్టీఆర్

  • ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో 
  • తదుపరి సినిమా ఆలోచనలో ఎన్టీఆర్ 
  •  కథలను వినిపిస్తున్న యువ దర్శకులు
'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తంలో డేట్స్ కేటాయించాడు. ఆ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న తరువాత ఆయన త్రివిక్రమ్ ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసమే త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. ఆ తరువాత సినిమా కోసం ఎన్టీఆర్ కథలు వింటున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ ఖాళీ సమయంలోనే 31వ సినిమాకి సంబంధించిన కథను సెట్ చేయాలనే ఉద్దేశంతో, కొంతమంది యువ దర్శకులకు సంకేతాలు పంపించాడట. వాళ్లంతా కూడా తమ దగ్గరున్న కథల్లో, ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన కథలను వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కథలో కొత్తదనం .. పాత్రలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ఇంతవరకూ టచ్ చేయని సబ్జెక్ట్ ను చేయాలనే ఆలోచనతో ఎన్టీఆర్ కథలను వింటున్నాడు. చివరికి ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి మరి.


More Telugu News