మలయాళంలో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగును రాబట్టిన 'అల వైకుంఠపురములో'

  • మలయాళంలో బన్నీకి మంచి క్రేజ్ 
  • అక్కడ హిట్ కొట్టిన 'అంగు వైకుంఠపురతు'
  • సూర్య టెలివిజన్ లో ప్రసారం
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను మలయాళ భాషలో 'అంగు వైకుంఠపురతు' టైటిల్ తో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఇటీవల ఈ సినిమాను అక్కడి సూర్య టెలివిజన్ లో ప్రసారం చేయగా, 11.17 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మలయాళ  టెలివిజన్ చరిత్రలో ఇది రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ అని అంటున్నారు.

మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తన సినిమాలు మలయాళంలో విడుదలయ్యేలా ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ఈ సినిమా ఆయన క్రేజ్ ను అక్కడ మరింతగా పెంచింది. మలయాళంలో అల్లు అర్జున్ మరో హిట్ ను సొంతం చేసుకున్నందుకు, అక్కడ ఆయన సినిమాకి రికార్డుస్థాయి టీఆర్పీ రేటింగ్ రావడం పట్ల అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News