మా మధ్య ఉన్నది వ్యక్తిగత సంబంధం కాదు: శ్రీముఖి, రవి

  • ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం
  • తమది వృత్తి పరమైన బంధమేనన్న శ్రీముఖి, రవి
  • తాము మంచి స్నేహితులమని స్పష్టీకరణ
బుల్లితెరపై యాంకర్లు శ్రీముఖి, రవి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి షోలు చేశారు. ఈ షోలలో వీరు అత్యంత సన్నిహితంగా మెలగడంతో... వారిపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం భారీ ఎత్తున జరిగింది. అయితే ఆ తర్వాత ఆ వార్తలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల ఇద్దరూ కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఈ  షోలో ఇదే అంశానికి సంబంధించిన ప్రశ్నపై వారిద్దరూ క్లారిటీ ఇచ్చారు.

తమ మధ్య ఉన్నది వృత్తి పరమైన బంధమే తప్ప... వ్యక్తిగత బంధం కాదని శ్రీముఖి, రవి చెప్పారు. టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటామని... చేతులు పట్టుకోవడం వంటివి చేస్తుంటామని తెలిపారు. ఇలాంటివి చూసి, తమ మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు అనుకుంటుంటారని చెప్పారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని తెలిపారు. తాము ఏంటో తమ కుటుంబ సభ్యులకు కూడా తెలుసని చెప్పారు.


More Telugu News