భారత్‌లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ బలహీనమైనది!: శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
- వూహాన్లో విస్తరించిన దానితో పోల్చితే చాలా తేడా
- జన్యుపరంగా చాలా మార్పులకు గురైంది
- అందువల్ల దీని ప్రభావం ప్రమాదకరంగా ఉండక పోవచ్చు
ప్రస్తుతం భారత్‌ను భయపెడుతున్న కరోనా వైరస్ జన్యుపరంగా చాలా బలహీనమైనదని, అందువల్ల ఇది అంత ప్రమాదకారి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వూహాన్ నగరంలో విస్తరించిన వైరస్‌తో పోల్చుకుంటే ఈ వైరస్ చాలా బలహీనంగా కనిపిస్తోందని తేల్చిచెప్పారు. గత ఏడాది డిసెంబర్లో వూహాన్ నగరంలో కనుగొన్న వైరస్‌కు చుట్టూ కిరీటాల్లా ముళ్లు ఉన్నాయని, ఈ ముళ్లను బట్టే దానికి కరోనా అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
వూహాన్లో వెలుగు చూసిన తర్వాత మార్చినాటికి ఈ వైరస్ మూడు రకాలుగా మార్పు చెందినట్లు తమ పరిశోధనల్లో గుర్తించామని, అందుకే వీటికి ఏ, బీ, సీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. మొదటి రకం వైరస్ వూహాన్లో గుర్తించాక అది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు విస్తరించిందని చెప్పారు.
అక్కడ వైరస్ రెండు రకాల మార్పులకు లోనై యూరప్, అమెరికాకు విస్తరించిందని తెలిపారు. యూరప్, అమెరికాలో విస్తరించిన వైరస్ జన్యుపరంగా చాలా డిఫరెంట్‌గా, బలంగా కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటితో పోల్చుకుంటే భారత్‌లో విస్తరిస్తున్న వైరస్ చాలా బలహీనంగా ఉందని తేల్చిచెప్పారు.