నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు!
- మూడు, నాలుగు రోజులు విభిన్న పరిస్థితులు
- సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
- కొన్ని చోట్ల వర్షాలకు అవకాశం
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని, వచ్చే మూడు, నాలుగు రోజులు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నమోదు కావచ్చని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే, 2 నుంచి 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురవవచ్చని హెచ్చరించారు. వారాంతం వచ్చే సరికి వాతావరణం సాధారణ స్థాయికి చేరుతుందని అంచనా వేశారు.