సుకుమార్ దారిలోనే కొరటాల
- కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
- త్వరలో నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్
- లేడీ అసిస్టెంట్ కి దర్శకత్వ బాధ్యతలు
ఒక వైపున దర్శకుడిగా వరుస హిట్లు కొడుతూనే, మరో వైపున నిర్మాతగాను సుకుమార్ విజయాలను అందుకుంటున్నాడు. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అసిస్టెంట్లను, తను నిర్మించే సినిమాల ద్వారా దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు. కొరటాల శివ కూడా అదే బాటలో నడవనున్నాడనే టాక్ ఒకటి ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
కొరటాల నిర్మాతగా మారనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. తన దగ్గర చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఓ లేడీ అసిస్టెంట్ కి దర్శకత్వ బాధ్యతను అప్పగించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను ఆయనే సమకూర్చనున్నట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం. కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య' సెట్స్ పై వున్న సంగతి తెలిసిందే.