రంజాన్ ను ఇంట్లో ఉండే జరుపుకుందాం: నఖ్వీ
- మరో 10 రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం
- లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కోరిన నఖ్వీ
- అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిక
మరో 10 రోజుల్లో ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ముస్లింలంతా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఛైర్మన్ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విన్నవించారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కింద ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, ఇతర సంస్థలు ఉన్నాయని... రంజాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా, లాక్ డౌన్ నిబంధలను అనుసరించేలా చూడాలని చెప్పారు. ఈ మేరకు మత నేతలు, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లతో మాట్లాడానని తెలిపారు. ఇళ్లలోనే ఉండి అందరూ రంజాన్ వేడుకలు నిర్వహించుకునేలా చూస్తామని మత పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు.
లాక్ డౌన్ నిబంధనల మేరకు ఇప్పటికే దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదులు నడుస్తున్నాయని... రంజాన్ మాసంలో కూడా ఇది కొనసాగాలని నఖ్వీ తెలిపారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా... పెను ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు.