చీకట్లో గోతులు తవ్వుతూ.. సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడు: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

  • కరోనా నియంత్రణ ఏపీ సర్కారు కృషి
  • పారిపోయి హైదరాబాద్ లో దాక్కున్న చంద్రబాబు
  • ఏ మొహం పెట్టుకుని తిరిగి వస్తారు?
  • పచ్చ వైరస్ రక్తంలోకి ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదు 
కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రమిస్తుంటే, చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో గురువారం ఉదయం వరుస ట్వీట్లు పెట్టారు. కష్టకాలంలో ఏపీలో ఉండి, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన నేత, హైదరాబాద్ లో దాక్కున్నారని, రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు.

"తుప్పు నాయుడిది ముగిసిన చరిత్ర. విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. రేపు ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తాడు. ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు" అని మండిపడ్డారు.

ఆపై మరో ట్వీట్ లో "దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. యువ ముఖ్యమంత్రి కరోనా   నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అంతా ప్రశంసిస్తుంటే పచ్చ వైరస్ రక్తంలోకి ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదు. జగన్ గారిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతల పైన దొంగదాడికి తెగబడుతున్నారు. తూ... సిగ్గులేని జన్మలు!" అంటూ సెటైర్లు వేశారు.

దాని తరువాత, "కరోనా ముట్టడితో ప్రపంచమంతా తల్లడిల్లుతోంది. మన లాంటి దేశానికి ఇదో పెద్ద విపత్తు. కష్టకాలంలో అందరూ వ్యాధిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలి. ఇలాంటి టైంలో కొందరు ఎల్లో వైరస్ దద్దమ్మలు నీచపు కామెంట్లకు తెగబడుతున్నారు. వీళ్లెవరూ చట్టం నుండి తప్పించుకోలేరు" అని హెచ్చరించారు.


More Telugu News