చిరంజీవి 'ఆచార్య' సినిమా అప్డేట్స్ వెల్లడించిన కొరటాల శివ
- 'ఆచార్య' సినిమా షూటింగ్ 40 శాతం పూర్తి అయింది
- చరణ్ కోసం హీరోయిన్ ను ఎంపిక చేయాలి
- మరో ఐదేళ్లలో రిటైర్మెంట్ తీసుకుంటా
చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. రామ్ చరణ్ కోసం హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. ఇదొక సోషియో-ఫాంటసీ చిత్రమని... సహజ వనరులను కాపాడేందుకు ఒక వ్యక్తి చేసే పోరాటమే 'ఆచార్య' అని చెప్పారు.
ఈ సందర్భంగా కొరటాల శివ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని ఆయన చెప్పారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయమని తెలిపారు. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించేందుకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తానని చెప్పారు.