పారిశుద్ధ్య కార్మికుల ఫొటోలు పోస్ట్ చేసి ప్రశంసల జల్లు కురిపించిన మహేశ్ బాబు
- మన వీధులు పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నారు
- మనం సురక్షితంగా ఇంట్లో ఉంటున్నాం
- వారు మాత్రం ప్రతి రోజు బయటకు వచ్చి పనిచేస్తున్నారు
- వారి పట్ల గౌరవం, ప్రేమ నాలో ఎప్పటికీ వుంటాయి
కరోనా విజృంభణ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తోన్న సేవలపై సినీనటుడు మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. వీధుల్లో సేవలు అందిస్తోన్న వారి ఫొటోలను ఆయన పోస్ట్ చేశాడు. మన వీధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు వచ్చి, అవి పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశాడు.
మనం సురక్షితంగా ఇంట్లో ఉంటుంటే, వారు మాత్రం ప్రతి రోజు బయటకు వచ్చి మనం సురక్షితంగా ఉండడానికి పని చేస్తున్నారని కొనియాడాడు. కరోనాపై యుద్ధం చేస్తోన్న సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ వారు మన కోసం పనిచేస్తున్నారని మహేశ్ బాబు అన్నాడు.
వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నాడు. వారి పట్ల గౌరవం, ప్రేమ, వారికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆయన ట్వీట్లు చేశాడు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ట్విట్టర్ ఖాతాను ఆయన ట్యాగ్ చేశాడు.
కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు అందిస్తోన్న సేవలపై కూడా మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. కరోనా జాగ్రత్తలపై అవగాహన కలిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ఇప్పటికే పలు పోస్టులు చేశారు. తన కూతురు సితారతో కూడా ఆయన ఆరు గోల్డెన్ రూల్స్ చెప్పించి ఇటీవలే వీడియో పోస్ట్ చేశాడు.