'రామ్ చరణ్ తెలుసా నీకు?'.. చిన్నారితో కేటీఆర్ సరదా సంభాషణ... వైరల్ వీడియో!

  • కరోనాపై కేటీఆర్ సమీక్ష
  • హైదరాబాద్ బస్తీల్లో పర్యటించిన మంత్రి
  • ప్రజలకు స్వయంగా జాగ్రత్తలు చెప్పిన కేటీఆర్
తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా హైదరాబాద్‌‌ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, కరోనాపై సమీక్షలు జరుపుతూ, ప్రజలకు స్వయంగా జాగ్రత్తలు చెబుతున్న వేళ, ఓ ఇంటి వద్ద జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓ ఇంటి వద్ద ఆగిన ఆయన, తనను చూసేందుకు వచ్చిన ఇంట్లోని వారిని పలకరించారు. ఎవ్వరూ బయటికి వెళ్లరాదని, అత్యవసరమైతే నోటికి మాస్క్ వేసుకున్న తరువాతనే, వెళ్లాలని సూచించారు. మే 3 వరకు ఇంట్లో నుంచి కదలవద్దని, ఆ తరువాత ఏమిటనేది చెబుతామని చెప్పారు.

ఆపై తనను చూసేందుకు వచ్చిన చిన్న బాబును పలకరిస్తూ, "పిల్లలు ఇంట్లోనుంచి కదులుతున్నారా? పోనీయకండి. నీ కొడుకా..? ఏం పేరు" (పిల్లాడు రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చాడు), అవునా?... ఆ రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా?’’ అని సరదాగా మాట్లాడారు. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. దాన్ని మీరూ చూసేయండి!


More Telugu News