ఏనుగును కాపాడిన చిత్తూరు జిల్లా అటవీ అధికారులపై పరిమళ్ నత్వానీ ప్రశంసలు
- చిత్తూరు జిల్లాలో గోతిలో పడిన ఏనుగు
- గంటలపాటు శ్రమించి పైకి తీసిన అటవీ సిబ్బంది
- ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన పరిమళ్ నత్వానీ
ఇటీవలే ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ దక్కించుకున్న పరిమళ్ నత్వానీ చానాళ్ల తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఓ అంశంపై స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు పెద్ద గోతిలో పడిపోగా, చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి దాన్ని కాపాడారు. దీనిపై పరిమళ్ నత్వానీ ట్విట్టర్ లో స్పందించారు.
"అటవీశాఖ అధికారులు గోతిలో పడిపోయిన ఏనుగును అతి కష్టమ్మీద బయటికి తీశారు. జంతువుల ప్రాణాలకు సైతం వారు విలువ ఇచ్చిన తీరును అభినందిస్తున్నాను. ప్రతి జంతువు ప్రాణం ఎంతో ముఖ్యమని భావించి కాపాడేందుకు ప్రయత్నించిన వైనం ప్రశంసనీయం" అంటూ వ్యాఖ్యానించారు. అధికారులు ఆ ఏనుగును కాపాడిన వీడియోను కూడా పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు.