ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ అవే!
- ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- స్పెషల్ వీడియోను వదలనున్న రాజమౌళి
- టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్న త్రివిక్రమ్
రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మరో 25 శాతం చిత్రీకరణ జరిపితే షూటింగు పూర్తవుతుంది. ఇటీవలే చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకి సంబంధించిన ఒక వీడియోను వదిలారు. ఇక మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఆ రోజున ఆయన పాత్రకి సంబంధించిన వీడియోను వదలడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.
ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున టైటిల్ పోస్టర్ ను వదలాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ రెండు కానుకలు అభిమానుల ముందుకు రానున్నాయన్న మాట.