పాత టీ-షర్ట్ ను మాస్క్ గా మార్చుకున్న మంచు విష్ణు!
- డాక్టర్ల కోసం సర్జికల్ మాస్క్ లను వదిలేద్దాం
- ఈ విషయాన్ని అందరికీ చెప్పండి
- ఇంట్లో సురక్షితంగా ఉండాలని విష్ణు పిలుపు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, తన ముఖానికి మాస్క్ ను తానే స్వయంగా తయారు చేసుకున్నాడు. పాత టీ-షర్ట్ ను ఉపయోగించి, ఇంట్లోనే దీన్ని రూపొందించానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించాడు.
"ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందు వరసలో నిలిచి పోరాడుతున్న వారి కోసం సర్జికల్ మాస్క్ లను వదిలేద్దాం. మీ దగ్గర టీ-షర్ట్ ఉందా? మీరు కూడా మాస్క్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను వేసుకున్న ఈ మాస్క్ ను నా పాత టీ-షర్ట్ తో నేనే తయారు చేసుకున్నాను. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. అందరూ మాస్క్‌ను తయారు చేసుకోండి. సురక్షితంగా ఉండండి" అని ట్వీట్ పెట్టాడు.