'ఆర్ ఆర్ ఆర్' బడ్జెట్ కి మించి ప్రభాస్ తదుపరి సినిమా?

  • నాగ్ అశ్విన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్
  • సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథాకథనాలు
  • రంగంలోకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు
నాగ్ అశ్విన్ పేరు వినగానే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' సినిమా గుర్తుకొస్తుంది. దర్శకుడిగా ఆయన సత్తాను ఆ సినిమా చాటిచెప్పింది. ఆ తరువాత కొంతకాలం పాటు ఒక కథపై కసరత్తు చేస్తూ వుండిపోయిన ఆయన, ఇటీవలే తన తదుపరి సినిమా ప్రభాస్ తో ఉంటుందని ప్రకటించాడు.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుందనీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తామని చెప్పాడు. ఈ సినిమా బడ్జెట్ 'ఆర్ ఆర్ ఆర్' బడ్జెట్ ను మించి వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' 350 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోంది. అంతకుమించిన బడ్జెట్ తో ప్రభాస్ మూవీ ఉంటుందని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ ను జోడించిన కథ కావడం .. బాలీవుడ్ కి చెందిన ఆర్టిస్టులు ఎక్కువ మంది కనిపించనుండటం .. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనుండటం ఈ స్థాయి బడ్జెట్ కి కారణమని చెప్పుకుంటున్నారు.


More Telugu News