ప్రతినెలా ఏడాదిపాటు విరాళం ఇచ్చి సహకరించండి: రెవెన్యూ ఉద్యోగులకు కేంద్రం విజ్ఞప్తి!
- ప్రతినెలా ఒకరోజు వేతనం పీఎం-కేర్స్‌కు ఇవ్వాలని వినతి
- అంతర్గతంగా ఈ మేరకు సర్క్యులర్ జారీ
- దీనిపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు
కేంద్ర రెవెన్యూ ఉద్యోగులనుద్దేశించి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఓ సర్క్యులర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్యోగులు దీనికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే...కరోనా విపత్తు నేపథ్యంలో పీఎం-కేర్స్‌కు పలువురు దాతలు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
అదే సయయంలో అన్ని విభాగాల ఉద్యోగులు తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక శాఖ ఈ అంతర్గత సర్క్యులర్‌ను జారీ చేసింది. ‘ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగులంతా ఏడాదిపాటు ప్రతినెలా ఒకరోజు విరాళాన్ని పీఎం-కేర్స్‌కు అందించి సహకరించాలి’ అన్నది ఆ సర్క్యులర్ సారాంశం. దేశం కోసమే కదా అని పలువురు ఈ విజ్ఞప్తికి మద్దతు తెలియజేస్తుండగా, ఏడాదిపాటు ఎలా సాధ్యమవుతుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.