కరోనా దెబ్బకు కుదేలైన రెస్టారెంట్ యజమాని... ఆదుకున్న కస్టమర్!

  • ఆంక్షల కారణంగా రెస్టారెంట్ కు తగ్గిన గిరాకీ
  • ఉద్యోగులను తీసేసి అన్నీ తానే అయిన యజమాని
  • రూ.76 వేలు (1000 డాలర్లు) ఇచ్చి ఆశ్చర్యపరిచిన కస్టమర్
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. ఫ్లోరిడాలోనూ కరోనా దెబ్బకు చిరువ్యాపారులు బాగా నష్టపోతున్నారు.  అసలు విషయానికొస్తే... ఫ్లోరిడాలో కొలిమాడియో అనే వ్యక్తి ఓ పిజ్జా రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. కరోనా ఆంక్షల కారణంగా అతడి వ్యాపారం నష్టాల్లో చిక్కుకుంది. ఆదాయం లేకపోగా, ఆర్థిక నష్టాలు రావడంతో ఉన్న ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. దాంతో కొలిమాడియో రెస్టారెంట్ లో పనివాడు, యజమాని అన్నీ తానే అయ్యాడు.

ఒకరోజు రెస్టారెంట్ కు రెగ్యులర్ కస్టమర్ ఒకరు వచ్చారు. అతడికి ఇష్టమైన పిజ్జా వైరెటీ ఏంటో తెలిసిన కొలిమాడియా ఆ ఐటమ్ తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆ వ్యక్తి తాను తినడానికి రాలేదని చెప్పాడు. అంతేకాదు, 1000 డాలర్లు (రూ.76 వేల రూపాయలు) కొలిమాడియోకు అందించి విస్మయానికి గురిచేశాడు. దాంతో ఆ రెస్టారెంట్ యజమాని నమ్మలేకపోయాడు. కొలిమాడియో కష్టాలు చూసి ఈ డబ్బు ఇచ్చానని సదరు కస్టమర్ చెప్పగా, ఇలాంటి వారు కోటికొక్కరు ఉంటారని కొలిమాడియో కృతజ్ఞతా పూర్వకంగా పేర్కొన్నాడు.


More Telugu News