'కార్తికేయ 2' హీరోయిన్ గా అనుపమ .. గెస్టుగా కలర్స్ స్వాతి
- గతంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'కార్తికేయ'
- ఇటీవలే మొదలైన సీక్వెల్ షూటింగు
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో కథానాయికగా 'కలర్స్' స్వాతి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. అలాంటి ఆ సినిమాకి 'కార్తికేయ 2' టైటిల్ తో సీక్వెల్ రూపొందుతోంది.
ఈ సినిమాలో 'కలర్స్' స్వాతి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజమేననేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె హీరోకి మాజీ లవర్ గా కనిపించనుందని అంటున్నారు. చాలా రోజుల తరువాత 'కలర్స్' స్వాతి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయిక పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.