లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అమెరికన్ల ఆందోళనపై ఆర్జీవీ కామెంట్

  • ఎక్కువ కేసులు, మరణాలు ఉన్న దేశంలో లాక్‌డౌన్ వద్దంటున్నారు
  • కరోనాపై ప్రభుత్వం అతి చేస్తోందని ఆరోపిస్తున్నారని ట్వీట్‌
  • యూఎస్‌లో 8 లక్షలకు చేరువైన కరోనా కేసులు
కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశం అమెరికానే. ఈ మహమ్మారిపై ఆలస్యంగా స్పందించిందని విమర్శలు ఎదుర్కొంటున్న అగ్రరాజ్య ప్రభుత్వం వైరస్ కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ, దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దాంతో, దేశంలో లాక్‌డౌన్ వెంటనే ఎత్తివేయాలని  ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించారు.

 ‘అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన అమెరికాలో ప్రజలు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దేశాన్ని వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైరస్‌పై తమ ప్రభుత్వం అతి చేస్తోందని, తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపిస్తున్నారు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. యూఎస్‌లో ప్రజల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియో లింక్‌ను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువ అవగా, ఇప్పటికే 42 వేల పైచిలుకు మంది చనిపోయారు.


More Telugu News